Skip to main content

Posts

Showing posts from September, 2023

privacy policy for german audio bible

Site Maintenance Privacy Policy Govardhan built the German Audio Bible app as a Free app. This SERVICE is provided by Govardhan at no cost and is intended for use as is. This page is used to inform visitors regarding my policies with the collection, use, and disclosure of Personal Information if anyone decided to use my Service. If you choose to use my Service, then you agree to the collection and use of information in relation to this policy. The Personal Information that I collect is used for providing and improving the Service. I will not use or share your information with anyone except as described in this Privacy Policy. The terms used in this Privacy Policy have the same meanings as in our Terms and Conditions, which are accessible at German Audio Bible unless otherwise defined in this Privacy Policy. Information Collection and Use For a better experience, while using our Service, I may require you to provide us with certain personally identifiable information. The infor...

test

పాస్క పండుగ నాడు Document Download Your download link will appear in 10 seconds.

Syro Malabar Holy Qurbana Telugu Songs

పాస్క పండుగ నాడు మహోన్నత స్తలమున పరలోక మందున్న మా తండ్రి ప్రభువా మహా రారాజా సకలమునకు ప్రభు దేవా ...

నీషేయా విశ్వాస సంగ్రహము

 ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును, భూలోకమును, కనుపించు, కనుపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పీత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడను, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పీతనుండి జన్మించెను.. దేవుని నుండుడి దేవునిగాను, జ్యోతినుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవుని గాను జన్మించెను. జన్మించినవాడు, సృష్టింపబడినవాడు కాడు. పితతో నేకస్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడేను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. (ఈ క్రింది వాక్యమును శిరము వంచి చెప్పుదురు) పవిత్రాత్మ ప్రభావము వలన కన్యమరియమ్మ ద్వారా, శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు ఫోన్సు పిలాతునీ క్రింద, సిలువ మీద కొట్టబడి, మరణము పొంది సమాధిచేయబడెను. పవిత్ర గ్రంధములో ఉన్నట్లు, మూడవ రోజున మరల జీవిముతో లేచెను. పరలోకమునాకు ఆరోహణమై పీత కుడి ప్రక్కన కూర్చొనియున్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరల మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే వుండదు. పితపుత్రుల నుండి బయలుదేరేడు ప్రభువును, జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసిం...

దివ్య కారుణ్య జపమాల

 (మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన) ప్రారంభము: సిలువ గురుతు, పరలోక జపము, మంగళ వార్త జపము, విశ్వాస సంగ్రహము (ప్రతి దేవా రహస్యము ప్రారంభించుటకు ముందు పెద్ద పూస వద్ద ఈ క్రింది జపము చెప్పవలెను) నిత్యుడగు పితయైన సర్వేశ్వరా! మీ డివ్య కుమారుడును, మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములను, ఆత్మను, దైవ స్వభావమును , మా పాపముల, ప్రపంచములోని మానవులందరి పాపముల పరిహార్దము మీకు సమర్పించుచున్నాము. ఆమెన్. (ప్రతి దేవరహస్యము యొక్క పది చిన్న పూసలపై ఈ క్రింది జపము చెప్పవలెను) యేసునాథుని అతి బాధాకరమైన శ్రమలను చూచి మా మీదను, ప్రపంచములోని మానవులందరి మీదను మీ కరుణను చూపండి. (ఐదు దేవా రహస్యములైన పిమ్మట ఈ ప్రార్థనతో ముగించవలెను) పవిత్ర దేవా, పవిత్ర సర్వశక్తిమంతుడా, పవిత్ర నిత్యుడా! మా మీదను, ప్రపంచ మానవులందరి మీదను మీ కరుణను చూపండి. (మూడు సార్లు చెప్పవలెను) అందరు: యేసు తిరుహృదయము నుండి ప్రవహించు దివ్య రక్తమా! జీవజాలమా! మిమ్ము ఆరాధిస్తున్నాను. (మూడు సార్లు)

పునీత అంతోనీ వారికి జపము

 దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోనీవారా, మీ జపముల వలన ఆత్మల రక్షణల మందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతీతులను, మూర్ఖ పనులను మనస్సు త్రిప్పిన వార! దివ్య రక్షకుని మార్గము ననుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపినవారా! అనేక అద్భుతములను చేయు వారము పొందినవారా ! మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా! దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్య బాలుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దిడ భాగ్యము పొందినివారా: మీరు ఉపకారములన్నింటిని మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించుటకు వరప్రసాదమును పొందునటుల చేయండి. దివ్య సత్ప్రసాదమునందు యేసును మేము ప్రేమతోను భక్తితోను లోకునునటుల వరప్రసాదమును పొందునటుల చేయండి. మీరు మీ మరణానంతరము యేసును ముఖాముఖిగా దర్శించునట్టు మేము కూడా వారిని ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునటుల మాకు సహాయము చేయండి. ఆమెన్

పరిశుద్ధ కుటుంబ జపము

 మహా ప్రియముగల యేసుప్రభూ ! ఎనలేని పుణ్యఫలముల చేతను మీ యింటి యందు చూపించిన సుమాతృక చేతను మీరు భూలోకములో జీవించిన కుటుంబమును ప్రతిష్ఠించి నవ ధరించితిరే. ఇప్పుడు మీ సముఖము నందు సాష్టంగముపడి మీ దయను ప్రార్థించేడు ఈ కుటుంబము మీద మీ కనికరము మీకు సొంతమని స్మరించు కొనండి. ఎందుకనిన, మీకే విశేషమైన విధముగా మమ్మును సమర్పించి ఒప్పజెప్పుచున్నాము. మా మీద కనికర ముంచి, మమ్ము సకల అపాయములలో నుండి కాపాడి, ఇక్కట్టు సమయములో మాకు సహాయముగా నుండండి. మేము మీ పరిశుద్ధ కుటుంబము యొక్క సుమాతృకను అనుసరించునటుల మాకు అనుగ్రహము దయచేయండి. ఈ విధముగా, ఈ భూలోకములో మిమ్ము ప్రామాణికముగా పూజించి, ప్రేమించి మా జీవితాంతమున మోక్షములో సదాకాలము మిమ్ము పొగడి కొనియాడుదుముగాక. పరిశుద్ధ మరియమ్మ! మా మధురమైన తల్లి! మీ దివ్య కుమారుడు మీ మనవి నాలకించునని తెలిసి, మీ సహాయమును కోరి, మీ దాపునకు వచ్చుచున్నాము. మహిమగల పితాపుత్రుడైన జోజప్పగారా! మీరును మీ బలము గల వేడుదల చేత మాకు సహాయముగా నుండండి. మరియమ్మగారి చేతుల ద్వారా మా జపములను జేసునాథుని దివ్యపాదములకు ఒప్పజెప్పండి. ఆమెన్

భోజనమునకు పిమ్మట జపము

 సదాకాలము నిత్యులైన సర్వశక్తిగల సర్వేశ్వరా! దేవరవారు మాకియ్య నవధరించిన సకల మేలులకు గాను దేవరావారికి మేలెరిగిన స్త్రోత్రము చేయుచున్నాను

భోజనమునకు ముందు జపము

 సర్వేశ్వరా స్వామి! మమ్మును మీ దయ చేత మేము భుజింపబోయే ఈ దానములను మా ఏలినవారైన జేసు క్రీస్తునాథుని తీరుముఖమును జూచి అశ్విరదింప నవధరించండి.

జపమాల

 మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా! దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్త్రోత్రము గాను ఏబది మూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తి తో చేసి పరాకు లేక ముగింప మీ సహయము నియ్యనవధరించండి. సకల పుణ్యమూలకు విశ్వాసమనేడి పుణ్యము ఆస్థి భారమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక. (1- పరలోక, 3- మంగళవార్త, 1-త్రిత్వ ) 1. సంతోష దేవ రహస్యములు (సోమ, శనివారములందు చెప్పవలెను) 1) గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురుంచి ధ్యానించుదము గాక 2) దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుటను గురుంచి ధ్యానించుదము గాక 3) జేసువు పుట్టుకను గురుంచి ధ్యానించుదము గాక 4) బాల జేసువు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుటను గురుంచి ధ్యానించుదము గాక 5) దేవమాత కానకబోయిన బాలజేసును దేవాలయములో కనుగొనుటను గురుంచి ధ్యానించుదము గాక దుఃఖః దేవ రహస్యములు (మంగళ, శుక్రవారములందు చెప్పవలెను) 1) జేసు రక్తచెమటను చెమర్చుటను గురుంచి ధ్యానించుదము గాక 2) జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురుంచి ధ్య...

పరిశుద్ధ స్లీవమార్గము

 పీఠమునకు ముందు వేడుకొనిన జపము నా రక్షకుడా! జూదులు మిమ్మును హత్య చేయుటకు తీసుకు పోయిన ఈ కఠిన మార్గమందు నా మీదగల స్నేహము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతిరి. ఈ దుఃఖమార్గము నందు మిమ్ము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహామును దయచేయండి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను. పాట: జేసునాదు డుర్విలోను వాసిజెంది ప్రేమతోడ-దాసులన్ రక్షించెను 1వ స్థలము జేసుప్రభుకు మరణశిక్ష విధించుట ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము. అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి. జేసునాథుడు రాతి స్తంభమున దెబ్బలు పొంది, ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక, స్లీవలో మారాము పొందుటను, పిలాతునిచే అన్యాయముగా విధింప బడుటను ధ్యానించుదము గాక నా రక్షకుడైన జేసువా! మిమ్ము మరణ దండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. అయితే నా పాపములే అట్టి తీర్పునకు లోజెసను. మీకు నేరము చేసినందు వలన నిండు మనసుతో దుఃఖిచుచున్నాను. ఆమెన్ (పరలోక, మంగళ. త్రిత్వ) ఓ: మా మీద దయగా నుండండి, స్వామి! అం: మా మీద దయగా నుండండి, స్వామి! మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక! పాట : ...