Skip to main content

పరిశుద్ధ స్లీవమార్గము

 పీఠమునకు ముందు వేడుకొనిన జపము

నా రక్షకుడా! జూదులు మిమ్మును హత్య చేయుటకు తీసుకు పోయిన ఈ కఠిన మార్గమందు నా మీదగల స్నేహము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతిరి. ఈ దుఃఖమార్గము నందు మిమ్ము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహామును దయచేయండి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను.

పాట:

జేసునాదు డుర్విలోను

వాసిజెంది ప్రేమతోడ-దాసులన్ రక్షించెను

1వ స్థలము

జేసుప్రభుకు మరణశిక్ష విధించుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు రాతి స్తంభమున దెబ్బలు పొంది, ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక, స్లీవలో మారాము పొందుటను, పిలాతునిచే అన్యాయముగా విధింప బడుటను ధ్యానించుదము గాక

నా రక్షకుడైన జేసువా! మిమ్ము మరణ దండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. అయితే నా పాపములే అట్టి తీర్పునకు లోజెసను. మీకు నేరము చేసినందు వలన నిండు మనసుతో దుఃఖిచుచున్నాను. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : భారమైన స్లీవమ్రాను

కృరులైన జూద జాతి - వారు జేసు కేత్తిరి

2వ స్థలము

జేసునాథుడు స్లీవను మోయుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు తన భుజము మీద స్లీవను మోసుకొని పోవు సమయమున నన్ను తలంచి తాను పొందబోవు పాటులను మరణమును నా కొరకై తమ పితకు ఒప్పగించుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! మరణకాలము వరకు మీరు నాకు విదించేడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవ మోసుకొనిపోవుటలో, మీరనుభవించిన పాటుల ఫలమును జూచి, నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగముతోను నా స్లీవను మోసుకొనుటకు, నాకు కావలసిన సహాయము దయచేయవలయునని మిమ్ము ప్రార్థించుచున్నాము. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : మమ్ము భ్రోవ ప్రేమనంత

కుమ్మరించ వేడినాము - మిమ్మునేక దీక్షతో

3వ స్థలము

జేసునాథుడు మొదటిసారి స్లీవకింద బోర్లపడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు రాతి స్తంబమున పొందిన దెబ్బల వలన గాయ పరుపబడిన అయన దేహము నుండి రక్తము హెరాళముగా కారిపోయెను. అందువలన, నడుచుటకు శక్తి లేక, భారమైన స్లీవమ్రాను క్రింద పడినప్పుడు, జేసు అనుభవించిన పాటులను ధ్యానించుదుము గాక

నా రక్షకుడైన జేసువా! మీకింత బాధపెట్టినది స్లీవ్ భారము కాదు. నా పాపముల భారమే. ఈ మొదట సారి పడుటయొక్క ఫలములను జూచి నేను పాపములో పడకుండ ఎల్లప్పుడును మిమ్మును ప్రేమించ అనుగ్రహము పాలించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : దేవమాత దీనురాలై

దైవ పుత్రునివెంబడించే - స్లీవమోయు చుండగా

4వ స్థలము

జేసునాథుడు తన దివ్య మాతకు ఎదురుపడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు తమ మాతకు ఎదురుపడినప్పుడు వారిద్దరికీ కలిగిన వర్ణింప సాధ్యముగాని దుఃఖము యెంతయని ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! ఈ దర్శనము నందు మీరును ఆమెయును అనుభవించిన వ్యాకులమును జూచి, మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగియుండు నా రాజ్ఞీ! మీ దివ్య కుమారుని పాటులను నేను నిరతము భక్తితో స్మరించునట్లు నా కొరకు మనవి చేయండి. నేను మీతో ఎల్లప్పుడూ మోక్షములో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యము పొందునటుల ప్రార్థించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : తల్లి జేసునథుని గాంచి

తల్లడిల్లి సొమ్మసిల్లె - నుల్ల మెల్ల నీరయ్యేను

5వ స్థలము

జేసునాథుడు స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడగుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు ఒక్కొక్క అడుగునకు జీవము విడిచేడు వానివలె నుండెను. జూదులు ఇది జూచి, జేసును స్లీవాలో కొట్టి అవమానముగా చంపవలయునని తలంచంగా, అయన త్రోవలోనే మృతి పొందుదురేమోయని చింతించి, కర్త వెనుక స్లీవను మోయుటకు సిరేనియా సీమోనును బలవంతము చేయుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! నేనును నా స్లీవను సీమోనునివలె పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును, మరణసంకటమును చేకొని, మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు ఒప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి బొందితిరి. నేనును మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : గాసినొంది స్లీవమోయు

జేసుస్వామి మోము తుడ్చె - వాసిగ వెరోనికా

6వ స్థలము

వేరోణికమ్మ జేసునాథుని ముఖమును తుడుచుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు పొందిన గాయములు వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన అతని తీరు ముఖమును వేరోణికమ్మ జూచి ఒక వస్త్రము నతనికియ్యగా దానితో జేసువు తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలీక ఆ వస్త్రము మీద ముద్రింపబడుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! ముందు మీ తీరు ముఖము మిక్కిలి యందముగా నుండెను. కానీ ఇప్పుడు గాయములచేతను, రక్తము చేతను, మారుపడి విరుపముగా నున్నది. ఙ్ఞానస్నానములో నేను మీ ఇష్ట ప్రసాదములు పొందినప్పుడు నా యాత్మయు అందముగా నుండెను. అయినను పాపము చేత దానిని చెడగొట్టుకొంటిని. మీ తిరుపాటులను జూచి దానిని చక్కపరచండ. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : కృర జుద గుంపు జేసున్

ఘోర రీతి పట్టికొట్టి - మెరలేక మొదిరి

7వ స్థలము

జేసునాథుడు రెండవసారి స్లీవకింద బోర్లపడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు రెండవసారి స్లీవకింద పడుటవలన అయన తీరుశిరస్సునందును, అవయవములందునుగల గాయములలో తిరిగి నొప్పి గలుగుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! మీరు యెన్నియోమారులు నాకు మన్నింపు దయచేసియున్నను నేను లెక్కలేని మారులు మల్లి పాపములో బడి మీకు ద్రోహము చేసితిని. హా ! జేసువా! ఇకనైనా నా మరణపర్యంతమును మీ యనుగ్రహమునందు స్థిరముగా నుండ, కావలసిన సహాయము, ఈ రెండవ పాటును జూచి నాకు దయచేయండి. నాకు వచ్చేడు సకల శోధనలయందు నేను మీ శరణుజొచ్చి మిమ్మును ఎడబాయకుండునటుల అనుగ్రహము పాలించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : కోరి పాప పుంజమేల్ల

భారదోలా జేసుస్వామి - క్రూర భాదనొందెను

8వ స్థలము

జేసునాథుడు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు నడచిపోవునప్పుడు అయన శరీరము నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు, కొందరు స్త్రీలు అయన పరితాపకరమగు ష్టితిని జూచి కనికరపడి ఏడ్చిరి. అప్పుడు జేసునాథుడు వారిని ఊరడించుచు "జెరూసలేము కుమార్తెలారా! నా నిమిత్తము ఎడ్వక మీ నిమిత్తమును, మీ బిడ్డల నిమిత్తమును యేడువండి" అని మందలించుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపములచేత రప్పించిన స్థితిని జూచి చింతించుచున్నాను. నరకవేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ యెడల గల ప్రేమ వలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : స్లీవ మోయు శక్తి లేక

ద్రోవయందు క్రింద గులే - లేవలేక జేసువు

9వ స్థలము

జేసునాథుడు మూడవసారి స్లీవకింద బోర్లపడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు గాయములవలన బలహీనుడయ్యెను. కొలపాతకుల నిష్ఠురము మితముమించి యుండెను. ఆయనకు కదలుటయే కష్టముగా నుండినను శీఘ్రముగా నడవవలయునని సైనికులు తొందరపరచు చుండిరి. అందువలన జేసునాథుడు మూడవసారి స్లీవకింద బోర్లపడుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! మీ ప్రేమను తిరస్కరింప జేసిన నా దుర్గుణములను , ఈ లోకాశలను జయించుటకు, మీరు పొందిన బలహీనము యొక్క ఫలమును జూచి, నాకు వరప్రసాదములను దయచేయండి. మీ సహాయముచేత ఇక యెప్పటికినీ పాపములో పాడను. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : ఒంటనున్న గాయమంత

నంటగా వస్త్రాలనెల్ల - గెంటి నీడ్చిలాగిరి

10వ స్థలము

జేసునాథుడు యూక వస్త్రములను తీసివేయుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

కొలపాతకులు బలవంతముగా జేసునాథుని వస్త్రములను ఒలుచునపుడు, వారు అతని శరీరముతో కరుచుకొని యుండిన ఆ వస్త్రములను మడ్డితనముగా పీకివేసిరి. వస్త్రములతో మాంసమును పేరుకుకొని వచ్చుటవలన జేసువు పడిన కఠోర వేదనలను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! ఈ సమయమందు, మీరు మీ శరీరమంతట పడిన బాధను జూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకును నిర్మోహత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక యుండుటకును సహాయము చేయండి. అంతటి కన్నా మిమ్మును ఎక్కువగా ప్రేమించునట్లు దయచేయండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : జంటదొంగ వార్లమధ్య

మంటభారమైన స్లీవ్ - కంటగించినాటిరీ

11వ స్థలము

జేసునాథస్వామి స్లీవలో కొట్టబడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు స్లీవమీద పరుండబెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణము కొరకు పీతయైన సర్వేశ్వరునికి తమ జీవమును బలిగా ఓప్పగించిరి.

పాతకులు ఇనుప చీలల చేత ఆయనను స్లీవమీద కొట్టి, దానిని నాటి అవమానకరమైన ఈ మ్రాని మీద ఆయనను మహాహ వేదనతో చావా విడుచుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! నా హృదయమును మీ తీరు పాదములకు అంట గొట్టి, అది ఇంక ఎన్నటికిని మిమ్ము విడువ కుండ యుండుటకు నిరంతరము మీ పాదముల కాచుకొని యుండ చేయండి. నాకన్నా అధికముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనస్సుతో దుఃఖ పడుచున్నాను. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : నేడేయంత పూర్తి యంచు

నాడే శ్రీ శీరంబు వంచి - వీడినాడు ప్రాణము

12వ స్థలము

జేసునాథుడు స్లీవలో మృతి పొందుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు మూడుగంటలు స్లీవమీద మహా ఆరాటమును పొందిన వెనుక, ఉపద్రవమువలన పీడింపపడి, శరీరభారమున క్రుంగి, తలవంచి మరణించుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! నా మీద గల ప్రేమచేత మీరు మృతిబొందిన స్లీవమ్రానును భక్తితో ముద్దు పెట్టుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసియుండెను. అయినాను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్ష భాగ్యము ఇచుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని] మృతిపొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా యాత్మను మీ చేతులతో నొప్పగించున్నాను. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : బాధపెట్టు శత్రుగుంపు

నాదరించ వేడినాడు - నాథుడైన జేసువు

13వ స్థలము

జేసునాథుడు స్లీవనుండి దింపబడుట

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుడు జీవము విడిచిన వెనుక అయన శిష్యులగు జోసేపు నీకొదేమను వారలిద్దరు ఆయనను స్లీవనుండి దించి దుఃఖముతో నిండిన అతని తల్లి చేతులతో నుంచిరి. ఆమె చెప్పగూడని నెనరుతో ఆ దివ్య శరీరమును చేకొని, కౌగలించుకొనూటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మును ప్రేమించుటకు సహాయము చేయండి. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాతా ! మీ ప్రియా కుమారుని మీద మీకు గల ప్రేమను జూచి నన్ను మీ దాసునిగా జేకొని నాకొరకు ప్రార్థించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : భాసురుండు మోక్షరాజు

దాసులైన పాపజాతి - కోసమై మరణించెను

14వ స్థలము

జేసునాథుని శరీరమును సమాథిలో నుంచుట 0

ఓ: జేసుక్రీస్తువా! మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము జేయుచున్నాము.

అం: ఏలయనగా, మీ తిరుస్లీవచేత లోకమును రక్షించితిరి.

జేసునాథుని శరీరమును మోసుకొని పోవుచున్న అయన శిష్యులను అతని తల్లి వెంబడించి, అతని దివ్య శరీరామును థానే సమాధిలో క్రమపరచెను. అటువెనుక వారాలు సమాధిని మూసి యెడబాసిపోవుటను ధ్యానించుదము గాక.

నా రక్షకుడైన జేసువా! మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవనాడు జీవవంతులై లేచితిరి గదా! ఈ ఉత్త్తనమును చూచి లోకాంత్యమున నేనును మీతో ఉత్తానమగుటకును, మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. ఆమెన్

(పరలోక, మంగళ. త్రిత్వ)

ఓ: మా మీద దయగా నుండండి, స్వామి!

అం: మా మీద దయగా నుండండి, స్వామి!

మరణించిన విశ్వాసుల ఆత్మలు, సర్వేశ్వరుని దయవలన సమాదానమందు విశ్రమింతురుగాక!

పాట : పాపులైన దీనులారా!

దాపుచేరి కొల్వరారే - పాపదోష మీడునె

జపము

హా రక్షకుడా! లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యుదాసుని ముద్దువలన శత్రువులకు చూపించబడను, అనాసు, కైపాసు ! పిలాతు, హేరోదెసను వారల ముందర అవమానముగా ఒప్పగించబడను. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడను. ఊమియబడను, ముండ్ల కిరీటము ధరింపబడను, మీ వస్త్రములు తీయబదను, మీరు స్లీవమీద కొత్తబడను. ఈటె చేత పొడవబడను చిత్తగించితీరే. నేను మహా పాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణచేసిన మీ తీరు మరణమును దేవరవారు చూచి నరక బాధలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లీవమీద కొట్టబడి మనస్తాపబడిన దొంగ వానిని తీసుకు పోయిన స్థలమునకు నన్నున్ తీసుకుపోండి. ఆమెన్

(ఉత్తమ మనస్థాప జపము )

పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరునట్టుగా ((పరలోక, మంగళ. త్రిత్వ)