దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోనీవారా, మీ జపముల వలన ఆత్మల రక్షణల మందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతీతులను, మూర్ఖ పనులను మనస్సు త్రిప్పిన వార! దివ్య రక్షకుని మార్గము ననుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపినవారా! అనేక అద్భుతములను చేయు వారము పొందినవారా ! మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా! దేవునిపై మీకు గల ప్రేమాతిశయము వలన దివ్య బాలుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దిడ భాగ్యము పొందినివారా: మీరు ఉపకారములన్నింటిని మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించుటకు వరప్రసాదమును పొందునటుల చేయండి. దివ్య సత్ప్రసాదమునందు యేసును మేము ప్రేమతోను భక్తితోను లోకునునటుల వరప్రసాదమును పొందునటుల చేయండి. మీరు మీ మరణానంతరము యేసును ముఖాముఖిగా దర్శించునట్టు మేము కూడా వారిని ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునటుల మాకు సహాయము చేయండి. ఆమెన్