సర్వేశ్వరుడు మనకు చేసిన యుపకారములన్నీ తలంచుము ఓ: సర్వేశ్వరా, దయాసముద్రుడవై యుండేడు స్వామి ఏలినవారు నన్ను సృష్టించి నాకు ఆత్మ శరీరములకు కావలసిన వస్తువులన్నియు ఇచ్చితీరే: అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక ఓ: ఏలినవారా, నేను ఎన్నో పాపములను చేసినను నన్ను తల్లిదండ్రులవలె కాపాడితేరే. అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక ఓ: ఏలినవారా, మీరు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి నా కొరకుగాను అనేక పాటులను అనుభవించి స్లీవమీద కఠినమైన మరణమును పొందితీరే. అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక ఓ: ఏలినవారా , నన్ను శ్రీసభలో జేర్చి నా పాపములను పరిహరించితిరే. అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక ఓ: స్వామి! నేను చేసిన పాపముల నిమిత్తము నన్ను నరకములో త్రోయక పాపసంకీర్తన ముఖంతరముగా నా పాపములన్నింటినీ మన్నించి సత్ప్రసాదమనెడు దివ్య భోజనము నాకు నియ్య నవధరించితిరే అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక ఆత్మశోధన పవిత్రాత్మయైన సర్వేశ్వరా, దేవరవారు మాయందు వేంచేయు అనుగ్రహించండి. పరలోకమునుండి మీ దివ్య ప్రకాశ కిరణములు మాపై వ్యాపింపచేయండి. నేను ఈ దినము చేసిన పాపములన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొని వాని కొరకు మనస్థాపం పద మీ సహ...
Posts
స్వామీ కృపగా నుండండి క్రీస్తువా కృపగా నుండండి స్వామీ కృపగా నుండండి క్రీస్తువా! మా ప్రార్థన విన నవధరించండి క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము దయ చేయండి పరలోకమందుడెడు పితయైన సర్వేశ్వరా , ....... మా మీద దయగా నుండండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా, పవిత్రాత్మయైన సర్వేశ్వరా, నిత్య సర్వేశ్వరుని సుతుడైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని ప్రకాశమైన జేసువా, నిత్యకాంతి యొక్క జ్యోతియైన జేసువా, మితిలేని మహిమగల రాజైన జేసువా, నీతి సూర్యుడైన జేసువా, పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క పుత్రుడైన జేసువా, మితిలేని ప్రేమకు పాత్రుడైన జేసువా, మహస్తుతికి పాత్రమైన జేసువా, మితిలేని బలముగల దేవుడైన జేసువా, వచ్చేడి యుగములకు తండ్రియైన జేసువా, పరమ యోచనలకు దూతయైన జేసువా, సర్వశక్తుడగు జేసువా, మహా ఓర్పుగల జేసువా, మహా విధేయత గల జేసువా, శాంతమును దీనతయునుగల జేసువా, మమ్ము ప్రేమించు జేసువా, నిష్కామ ప్రియుడైన జేసువా, సమాధాన దేవుడైన జేసువా, మా ప్రాణమునకు కర్తయైన జేసువా, సమస్త పుణ్యమూలకు మాతృకైనా జేసువా, ఆత్మరక్షణ కాంక్షకుడైన జేసువా, మా దేవుడైన జేసువా, మా శరణమైన జేసువా, దరిద్రులకు తండ్రియైన జేసువా, విశ్వాషులకు నిక్షేప...
పరలోకము యొక్క రాజ్ఞీ! సంతోషించండి, - అల్లెలూయ, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భము నందు అవతరించినారు, - అల్లెలూయ, ఆనతిచ్చిన ప్రకారం ఉత్తానమైనారు, - అల్లెలూయ, మా కొరకు సర్వేశ్వరునికి మనవి చేయండి. - అల్లెలూయ, కన్యకాయుండెడు మరియమ్మ, ఆనందించి సంతోషించండి. - అల్లెలూయ, ఏలయనిన ఏలినవారు నిజముగా ఉత్తానమైనారు - అల్లెలూయ, ప్రార్థించుదము: సర్వేశ్వరా స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడైన జేసు క్రీస్తుని ఉత్తానము చేత లోకమును సంతోష పరచ చిత్తగించితేరే అతని దివ్యమాత అయిన కన్యమరియమ్మ వల్ల నిత్య జీవమైన పరలోక భాగ్యము మేము పొందునట్లుగాఅనుగ్రహించ నవధరించండి. జేసుక్రిస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవినిమాకు దయచేయండి. ఆమెన్.
ఏలినవారి సన్మస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను .... ఆ అమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను (మంగళవార్త జపము) ఇదిగో, ఏలినవారి దాసురాలను ... నీ మాట చొప్పున నాకు అగును గాక (మంగళవార్త జపము) సుతుడైన సర్వేశ్వరుడు మనుష్యవతారము ఎత్తేను: మరియు మనతో కూడా వశమై యున్నారు (మంగళవార్త జపము) జేసు క్రిస్తునాథుని వాగ్దత్తములకు మేము పాత్రుల మగునట్టు: సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధమాత! మా కొరకు ప్రార్థించండి ప్రార్థించుదము : సర్వేశ్వరా స్వామి! సన్మనస్కుడు చెప్పి నందు వలన మీ సుతుడైన జేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలిసికొంటిమే! అతని పాటుల వలనను, స్లీవవలనను , ఉత్తానము యొక్క మహిమ మేము పొందునట్టుగా మాకు మీ వరప్రసాదములను దయచేయ నవధరింప వలయునని దేవర వారిని వేడుకొను చున్నాము. జేసుక్రిస్తు నాథుని దివ్య ముఖమును జూచి, ఈ మానవుని మాకు దయచేయండి. ఆమెన్.
ఓ నా జేసువా! ఈ దినము నేను చెప్పేడు జపములును చేయు పనులను, పడు కష్టములను నా పాపముల పరిహారము నకును నమస్త సభికుల ఉద్దేశ్యములకును, మీరు యెడతెగక పూజ బలిలో మిమ్ము నొప్పగించేడు యుద్దేశ్యములతో వినీ నేకీభవించి, మరియమ్మ గారి నిష్కళంక హృదయ మూలముగా మీకు సమర్పించు చున్నాను. మరియు ... పై సత్కార్యములను మీకు సమర్పించు చున్నాను
మిక్కిలి నెనరుగల తల్లీ,మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ యుపకార సహాయములను బ్రతిమాలి,మీ వేడుకోలు సహాయమును అడిగినవారలయందు ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంప నవధరించండి. కన్యకల రాజ్ఞీయైన కన్యకా! కరుణారసముగల తల్లీ! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి,మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చేచు పాపినైనా నేను మీ దయాళుత్వమునకు కాచుకొని, మీ సముఖములో నిలుచుచున్నాను. అవతరించిన వార్తయొక్క తల్లీ! నా విజ్ఞాపనమును త్యజింపక దయపరివై నిన్న విన నవధరించండి. జన్మపాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మా! పాపులకు శరణమా! ఇదిగో పరుగెత్తివచ్చి, మీ శరణుజొచ్చితిమి. మా మీద నెనరుగా నుండి. మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. (ఇట్లు మూడు సార్లు చెప్పి 1పర. 1మం. త్రీత్వ. )
గురువు - పిత,పుత్ర,పవిత్రాత్మ నామమున అందరు - ఆమెన్. గు - ఓ మరియమ్మ ! పరిపూర్ణ సౌందర్యవతీ అం - నన్ను దేవునికి ప్రియమగునట్లు చేయుము గు - జన్మ పాపము లేనివారా ! అం - నన్ను పాపము నుండి కాపాడండి. గు - మోక్షము యొక్క మహిమా ! అం - నన్ను పరలోకమున జేర సహాయము చేయండి. గు - కష్టపడు వారికి సంతోషము నొసంగువారా ! అం - మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. గు - పాపాత్ములకు శరమునొసంగు వారా ! అం - నన్ను దేవకోపాగ్నినుండి కాపాడండి. గు - వివేకముగల కన్యకా దయగలమాత ! అం - మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్ధించండి. ప్రార్ధించుదము కన్యమరియమ్మ యొక్క / జన్మపాపము లేని / యుద్భవము వలన / తన ప్రియకుమారునికి / తగిన నివాసమర్పించిన సర్వేశ్వరా ! తమ కుమారుని మరణమును బట్టి / ఆ యమ్మను / ఎలాంటి పాప దోషములు లేకుండా కాపాడిన వారా ! ఆమె మనవుల ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మిమ్మును చేర / చిత్తగింప వలయునని / ప్రార్ధించు చున్నాము . జన్మపాపము లేక యుద్భవించిన / మిక్కిలి పావన మరియమ్మా ! పాపులమైన మేము / ఈ దినము మీ శరణుగోరి వచ్చియున్నాము. / మీ నిర్మలోద్బవమును పొగడుటకు / నిండు హృదయముతో / మీ యెదుట మోకరించి యున్నాము. / తల్లి గర్భము...