Skip to main content

జేసునాధుని దివ్యనామ ప్రార్థన

 స్వామీ కృపగా నుండండి

క్రీస్తువా కృపగా నుండండి

స్వామీ కృపగా నుండండి


క్రీస్తువా! మా ప్రార్థన విన నవధరించండి

క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము దయ చేయండి


పరలోకమందుడెడు పితయైన సర్వేశ్వరా , ....... మా మీద దయగా నుండండి స్వామి


లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా,

పవిత్రాత్మయైన సర్వేశ్వరా,

నిత్య సర్వేశ్వరుని సుతుడైన సర్వేశ్వరా,

పితయైన సర్వేశ్వరుని ప్రకాశమైన జేసువా,

నిత్యకాంతి యొక్క జ్యోతియైన జేసువా,

మితిలేని మహిమగల రాజైన జేసువా,

నీతి సూర్యుడైన జేసువా,

పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క పుత్రుడైన జేసువా,

మితిలేని ప్రేమకు పాత్రుడైన జేసువా,

మహస్తుతికి పాత్రమైన జేసువా,

మితిలేని బలముగల దేవుడైన జేసువా,

వచ్చేడి యుగములకు తండ్రియైన జేసువా,

పరమ యోచనలకు దూతయైన జేసువా,

సర్వశక్తుడగు జేసువా,

మహా ఓర్పుగల జేసువా,

మహా విధేయత గల జేసువా,

శాంతమును దీనతయునుగల జేసువా,

మమ్ము ప్రేమించు జేసువా,

నిష్కామ ప్రియుడైన జేసువా,

సమాధాన దేవుడైన జేసువా,

మా ప్రాణమునకు కర్తయైన జేసువా,

సమస్త పుణ్యమూలకు మాతృకైనా జేసువా,

ఆత్మరక్షణ కాంక్షకుడైన జేసువా,

మా దేవుడైన జేసువా,

మా శరణమైన జేసువా,

దరిద్రులకు తండ్రియైన జేసువా,

విశ్వాషులకు నిక్షేపమైన జేసువా,

మంచిమెపరియైన జేసువా,

సత్య ప్రకాశమైన జేసువా,

నిత్య జ్ఞానమైన జేసువా,

మితిలేని మేలు స్వభావము గల జేసువా,

మా జీవమును మార్గమునైన జేసువా,

సన్మనస్కులకు పరమానందమైన జేసువా,

పీతపితృలకు రాజైన జేసువా,

అపోస్తులకు గురువైన జేసువా,

సువిశేషులకు భోదకుడైన జేసువా,

వేదసాక్షులకు ధృడమైన జేసువా,

స్తుతీయులకు ప్రకాశమైన జేసువా,

విరక్తులకు పవిత్రమైన జేసువా,

సకల మోక్షవాసులకు కిరీటమైన జేసువా,

జేసువా దయాపరులై యుండి,


అం: మా పాపములను మన్నించండి స్వామి !


జేసువా,దయాపరులై యుండి,


అం: మా ప్రార్థన విననవధరించండి స్వామి !


సకల కీడులనుండి, అం: మమ్ము రక్షించండి స్వామి!

సకల పాపముల నుండి,

మీ కోపాగ్నీ నుండి ,

పిశాచి తంత్రముల నుండి,

మోహాగ్ని నుండి,

నిత్య మరణము నుండి ,


దేవరవారు ఇచ్చేడు మంచిబుద్ధి, మంచి విచారములను మెము త్రోసివేయకుండా,

దేవరవారి జన్మమును జూచి,

దేవరవారి బాల్యమును జూచి,

దేవరవారి దివ్యనడతను జూచి,

దేవరవారి ప్రయాసలను జూచి,

దేవరవారి ఆరాటమును, రక్తచెమటను జూచి,

దేవరవారి స్లీవను, పాటులను జూచి,

దేవరవారి ఉపద్రవ నిర్బంధములను జూచి,

దేవరవారి మరణమును, భూస్థాపితమును జూచి,

దేవరవారి పరిశుద్ధ శరీర ఉత్తానమును జూచి,

దేవరవారి మోక్షరోపణమును జూచి,

దేవరవారి దివ్యసత్ప్రసాదమును స్థాపించినది జూచి,

దేవరవారి సంతోష మహిమలను జూచి,


లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!

మా పాపములను మన్నించండి స్వామి!


లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!

మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి!


లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!

మా మీద దయగా నుండండి స్వామి!


జేసువా! మా ప్రార్థన విన నవధరించండి

జేసువా! మా ప్రార్థన ప్రకారము దయ చేయండి



ప్రార్థించుదము


ఓ దివ్య జేసువా! అడగండి మీ కివ్వబడును, వెదుకండి మీకు లభించును. తట్టండి మీకు తెరువబడును అని మందలించి యుంటిరె; మిమ్ము మా పూర్ణ హృదయముతో మా వాక్కు క్రియల యందు ప్రేమించుటకును, మహిమపరచుటకును, ఎప్పుడు మరువకుండుటకును, యుత్తమమగు భక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము.



ఏలినవారా! మీ దివ్య నామము యెడల భయ భక్తులకు మేమెల్లప్పుడు కలిగి యుండు నటుల ప్రసాదింపుము. మమ్ము మీ శరణులో నెల్లప్పుడుండ జెసి, మీ భక్తి యందు దృఢపరచుము. సర్వ కాలము జీవించుచు పరిపాలించేడు సర్వేశ్వరా స్వామి, ఆమెన్.