Skip to main content

విశ్వాస సంగ్రహము

 పరలోకమును, భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేస్వరుని విశ్వసించుచున్నాను.

అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.

ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.

పో౦స్త్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి,

స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉ౦చబడెను.

పాతాళమునకు దిగి మూడవనాడు చనిపోయిన వారాలలో నుండి లేచెను.

పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చండి యున్నాడు.

అక్కడ నుండి జీవించు వారలకును,

చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును.

పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.

పరిశుద్ధ కతోలిక సభను,

పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.

పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.

శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.

నిత్య జీవమును విశ్వసించుచున్నాను.

ఆమెన్.